ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయంసినిమా

‘ మహర్షి ‘ రాఘవను సన్మానించిన చిరంజీవి.

Share This Post 🔥

నటుడు ‘మహర్షి’ రాఘవను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. ఆయన గొప్ప మనసును మెచ్చుకున్నారు. రక్తదానం విషయంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని ప్రేరణగా తీసుకోవాలని కోరారు.

మహర్షి రాఘవ వందసార్లు మా బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తదానం చేశారు. ఒక వ్యక్తి అన్నిసార్లు రక్తం ఇవ్వడం ఇదే ప్రప్రథమం. ఈ సందర్భంగా ఆయన్ని మా ఇంటికి ఆహ్వానించి సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. నిజంగా ఆయన చాలా గ్రేట్‌. మేం బ్లడ్‌బ్యాంక్‌ స్థాపించినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీ మోహన్‌. అదే రోజు కార్యక్రమంలో పాల్గొన్న రాఘవ.. నాటి నుంచి ఇప్పటివరకూ ఆదర్శ రక్తదాతగా నిలిచారు. ఆయన చేస్తున్న ఈ పని ఎంతోమందిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నా. ఇలాంటి దాతల వల్లే ఎంతోమందికి సమయానికి రక్తం అందుతుంది” అని మెచ్చుకున్నారు. మురళీ మోహన్‌ సైతం రాఘవను ప్రశంసించారు.

సినిమాల విషయానికి వస్తే.. ‘భోళాశంకర్‌’ తర్వాత చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకుడు. సోషియో ఫాంటసీ కథాంశంతో ఇది సిద్ధమవుతోంది. త్రిష కథానాయిక. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల చిరంజీవి-త్రిషలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. భారీ బడ్జెట్‌తో ఇది సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!