ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుజాతీయంతెలంగాణమహిళరాజకీయంసినిమా

ప్రభుదేవా పాటకు రాజమౌళి దంపతుల డాన్స్.. వీడియో వైరల్…

Share This Post 🔥

ప్రముఖ దిగ్గజ దర్శకుడు రాజమౌళి, తన సతీమణి రమతో డ్యాన్స్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా ఆ వీడియో ప్రముఖంగా దర్శనమిస్తోంది.

ఓ వైపు వర్క్‌ చేస్తూనే ఫ్యామిలీ టైమ్‌ను చక్కగా బ్యాలెన్స్‌ చేస్తుంటారని ఆయనకు మంచి పేరు ఉంది. షూటింగ్స్‌ నుంచి కాస్త విరామం దొరికినా.. కుటుంబసభ్యులతో ఎంజాయ్‌ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ వివాహ వేడుకలో పాల్గొని తన సతీమణి రమతో చేసిన డ్యాన్స్‌ వీడియో బయటకు వచ్చింది.

దీనికి సంబంధించిన రిహార్సల్స్‌ వీడియో తాజాగా బయటకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్‌ సీఈవో, నిర్మాత చెర్రీ కుమార్తె వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న రాజమౌళి తన సతీమణి రమతో డ్యాన్స్‌ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ప్రభుదేవా ఆల్‌టైమ్‌ హిట్స్‌లో ఒకటైన ‘అందమైన ప్రేమరాణి’ పాటకు వీరిద్దరూ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన రిహార్సల్స్‌ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రాజమౌళి-రమ డ్యాన్స్‌ ప్రాక్టీస్ చేస్తున్న క్లిప్‌ను చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

రాజమౌళి-రమ దంపతులు డ్యాన్స్‌ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!