ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

పోటీ లేకుండానే గెలిచిన ఐదుగురు బిజెపి అభ్యర్థులు…
ప్రారంభమైన బిజెపి విజయ పరంపర…

Share This Post 🔥

2024 పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీ విజయ పరంపర ప్రారంభమైంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.

ఈ క్రమంలో మొదటి దశలో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో ఆ రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు కేవలం బీజేపీ అభ్యర్థులు మాత్రమే నామినేషల్లు వేయడంతో ఐదు స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా విజయం సాధించింది. తాజా అప్‌డేట్‌లో తాలి నుండి జిక్కే టాకో, తాలిహా నుండి న్యాతో డుకోమ్, సగలీ నుండి రాటు టెచి, రోయింగ్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముచ్చు మితితో సహా మొత్తం 5 మంది అభ్యర్థులు పోటీ లేకుండా గెలిచినట్లు తెలుస్తుంది.

ఈ విజయంతో పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి భారీ షాక్ తగిలిందనే చెప్పుకొవాలి. కాగా మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 31 స్థానాల్లో గెలవాల్సి ఉంది. అయితే ఈ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో బీజేపీ 41 స్థానాలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న ట్రేండ్స్ చూస్తుంటే ఈ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!