ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతెలంగాణమహిళ

పైల్స్ సమస్య పరిష్కారం కోసం…

Share This Post 🔥


మనం తీసుకునే ఆహారమే మనకు  పైల్స్ రావడానికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, నీరు తక్కువగా తాగటం,మలబద్దకం సమస్య,ఒత్తిడి వంటి కారణాలతో పైల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.  పైల్స్ సమస్య ఉన్నప్పుడు బాధ విపరీతంగా ఉంటుంది.

ఈ సమస్యను కొన్ని ఆయుర్వేద ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.   డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కాలు  ఫాలో అయితే చాలా తొందరగా పైల్స్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  కాస్త ఓపిక, సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

గుప్పెడు గోరింటాకు శుభ్రంగా కడగాలి. రెండు వక్కలను తీసుకొని మెత్తని పొడిగా చేయాలి. మిక్సీ జార్ లో గోరింటాకు, వక్కల పొడి, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంపై రాసి పావుగంట అయ్యాక శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేస్తూ ఉండాలి.

అలా చేస్తూ ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు పాటించాలి. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం తగ్గించాలి. మూడు గంటల వ్యవధిలో కనీసం రెండుసార్లు లేచి ఓ 5 నిమిషాల పాటు అటు ఇటు తిరగడం మంచిది. నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి తగ్గి ఫైల్స్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది.

గమనిక : ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!