ఆంధ్రప్రదేశ్చిన్నారిజాతీయంతెలంగాణమహిళసినిమా

పుష్ప 2 టీజర్ వచ్చేసింది..
దద్దరిల్లిపోతున్న యూ ట్యూబ్.

Share This Post 🔥

ఎట్టకేలకు  బన్నీ ఫ్యాన్స్ నిరీక్షణకు తెర పడింది. పుష్పరాజ్ బర్త్ డే ట్రీట్ ఇచ్చేశారు పుష్ప 2 మేకర్స్. ఈరోజు (ఏప్రిల్ 8న) స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా కాసేపటి క్రితమే పుష్ప 2 టీజర్ రిలీజ్ చేశారు.

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ టీజర్ పై మరింత హైప్ పెంచేసింది. పూర్తిగా మాస్ అవతారంలో బన్నీ.. దేవి శ్రీ అందించిన బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే బన్నీ ఇదివరకు ఎన్నడూ కనిపించని గెటప్‏లో కనిపించనున్నాడని తెలుస్తోంది. పట్టుచీరలో మెడలో నిమ్మకాయాల మాలతో ఒంటినిండా బంగారు ఆభరణాలతో అమ్మోరు గెటప్ లో కనిపించారు. గంగమ్మ జాతరలో ఉగ్రరూపంతో నడిస్తూ.. చీరకొంగును నడుముకు చుట్టుకుంటూ వస్తున్నట్లు చూపించారు. టీజర్ మొత్తంలో ఒక్క డైలాగ్ లేకుండా బీజీఎంతో గూస్ బంప్స్ తెప్పించారు. తాజాగా విడుదలైన టీజర్ మాత్రం బన్నీ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించింది. గంగమ్మ జాతర జరిపించేందుకు అమ్మోరుగా వస్తున్న పుష్పరాజ్ గా కనిపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించిన సంగతి తెలిసిందే. అటు కంటెంట్.. ఇటు మ్యూజిక్ పాన్ ఇండియాను షేక్ చేశాయి. పుష్పరాజ్ పాత్రలో బన్నీ యాక్టింగ్ చూసి యావత్ దేశమే ఫిదా అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ మూవీ సెకండ్ పార్ట్ పుష్ప 2 ది రూల్ పై ఓ రేంజ్ అంచనాలు పెరిగాయి. ఇక వారం రోజులుగా పుష్ప 2 అప్డేట్స్‏తో.. పుష్పరాజ్ మేనియాతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊగిపోతున్న సంగతి తెలిసిందే.

గతంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలో పోషిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీలో బన్నీ ఊరమాస్ లుక్‏లో పుష్పరాజ్ పాత్రలో అదరగొట్టేశాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 ది రూల్ లో మరోసారి థియేటర్లను షేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

పుష్ప 2 చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. సుమారు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ నుంచి నార్త్ వరకు మూవీ లవర్స్ పుష్పరాజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ను రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్, బన్నీకి సంబంధించిన రేర్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట షేర్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!