ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

పీవోకే త్వరలోనే భారత్‌లో విలీనం : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు…

Share This Post 🔥


లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పీవోకే (పాక్ అక్యూపైడ్ కశ్మీర్‌)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హోలీ పండుగ సందర్భంగా లద్దాఖ్‌లోని లేహ్ సైనిక స్థావరాన్ని ఆయన సందర్శించారు.

అనంతరం జవాన్లతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే పీవోకే భారత్‌లో విలీనం అవుతుందని అన్నారు. పీవోకే ప్రాంతంలోని ప్రజలు భారత్‌తో తమ ప్రాంతాన్ని విలీనం చేసుకోవాలంటూ డిమాండ్లు చేస్తున్నారన్నారు.  ఇప్పుడు అక్కడ పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయని పేర్కొన్నారు. భారత్‌లో పీవోకే విలీనం అవుతందనే విశ్వాసం తనకు వంద శాతం ఉందన్నారు. ఢిల్లీ దేశ రాజధాని, ముంబై ఆర్థిక రాజధాని అయితే, లద్దాఖ్ మన దేశ శౌర్యానికి రాజధాని అని రాజ్‌నాథ్ అభివర్ణించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!