ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

నన్ను ఓడించేందుకు దేశంలోని శక్తులన్ని  ఏకమయ్యాయి : మోడీ

Share This Post 🔥

బెంగళూరు : తనను అధికారం నుంచి దింపేందుకు భారత్‌తో పాటు విదేశాల్లోని పెద్దలు, శక్తివంతులు చేతులు కలిపారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

చిక్కబళ్లాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కే సుధాకర్, కోలార్ నుంచి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరిన జేడీఎస్‌ అభ్యర్ధి ఎం మల్లేష్ బాబును బరిలోకి దింపింది.

ఈ సందర్భంగా అభ్యర్ధుల్ని గెలిపించాలంటూ కర్ణాటక చిక్కబళ్లాపూర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

ఈ సందర్భంగా తల్లులు, సోదరీమణులు ఇక్కడకు పెద్ద సంఖ్యలో వచ్చారు. మీ కుటుంబం కోసం మీరు ఎదుర్కొంటున్న సవాళ్లు, మోదీ తన ఇంట్లోనూ చూశారు. కానీ, నారీ శక్తి, మాతృ శక్తి ఆశీర్వాదం, సురక్షా కవచం (భద్రతా కవచం) కారణంగా మోడీ సవాళ్లతో పోరాడగలుగుతున్నారని వ్యాఖ్యానించారు.

తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు సేవ చేయడం, వారిని రక్షించే బాధ్యత మోదీ తీసుకున్నాను. అలా చేస్తున్న నన‍్ను ఓడించేందుకు శక్తులన్నీ ఏకమయ్యాయి. కానీ మీ ఆశీర్వాదం వల్లే వాటితో పోరాడ గలుగుతున్నానన్నారు.

శుక్రవారం లోక్‌సభకు జరిగిన తొలి దశ ఓటింగ్‌ ఎన్‌డీఏ వికసిత్‌ భారత్‌కు అనుకూలంగా సాగిందని ప్రధాని అన్నారు. అనంతరం ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష కూటమికి ప్రస్తుతం నాయకుడు లేడని, భవిష్యత్తుపై దృష్టి లేదని, వారి చరిత్ర స్కామ్‌లదే దుయ్యబట్టారు. 90 ఏళ్ల వయసులో తనతో వేదిక పంచుకున్న జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ శక్తి, నిబద్ధతపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.

కర్ణాటకలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని దక్షిణాది ప్రాంతాల్లోని 14 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 26న, ఉత్తరాదిలోని మిగిలిన 14 నియోజకవర్గాలకు మే 7న రెండో దశలో పోలింగ్ జరగనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!