ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై ఎంపీగా నామినేషన్.      అనంతరం అనూహ్య పరిణామం

Share This Post 🔥




ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్ బీజేపీలో జాయిన్ అయ్యారు. అనంతరం ఆమెకు బీజేపీ.. దక్షిణ చెన్నై ఎంపీ టికెట్ కేటాయించింది.

కాగా తమిళనాడులో మొదటి విడతలో ఎన్నికలు జరగనుండగా ఈ రోజు నుంచి అధికంగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తమిళిసై కూడా తన నామినేషన్ వేశారు. అనంతరం బయటకు వస్తుండగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

అదే సమయంలో తన సమీప అభ్యర్థి అయిన డీఎంకే మహిళ నేత తమిజాచి తంగపాండియన్ అడ్డు వచ్చింది. దీంతో ఇద్దరు నవ్వుతూ.. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. రాష్ట్రంలో డీఎంకే-బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ పోరు జరుగుతున్నప్పటికీ వారిద్దరూ అప్యాయంగా పలకరించుకుని కౌగిలించుకోవడం తో అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి పరిణామాలు తరచు జరుగుతుంటాయని.. పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!