Uncategorizedతెలంగాణమహిళ

తెలంగాణ టెట్ కు దరఖాస్తు చేశారా…? ఈ ప్రాక్టీస్ టెస్ట్ ట్రై చేయండి.

Share This Post 🔥

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌-2024) కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. మే 20 నుంచి జూన్‌ 3 వరకు జరగనున్న ఈ పరీక్షకు విద్యాశాఖ ప్రాక్టీస్‌ టెస్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ మాక్‌ టెస్టు అభ్యర్థుల ప్రిపరేషన్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. పరీక్ష మోడల్‌ తెలియడంతో పాటు సమయ పాలన, అభ్యర్థులు తమ బలాలు, బలహీనతల్ని అంచనా వేసుకొని తమను తాము మెరుగుపరుచుకొనేందుకు ఇదో మంచి అవకాశం. ఈ మాక్‌టెస్ట్‌ను టెట్‌ వెబ్‌సైట్‌లో పొందొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా టెట్‌కు 2.83 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

మాక్‌ టెస్టులు పొందండి ఇలా…

తొలుత టెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
హోమ్‌ పేజీలో TS TET Mock Test-2024పై క్లిక్‌ చేస్తే ఒక విండో ఓపెన్‌ అవుతుంది.

సైన్‌ ఇన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్‌ వస్తాయి. వాటిని క్షుణ్ణంగా చదివిన తర్వాత మీ ప్రాక్టీసును మొదలుపెట్టండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!