ఆంధ్రప్రదేశ్క్రీడలుతెలంగాణమహిళ

తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల ఎప్పుడంటే…?

Share This Post 🔥

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఈ నెల 20వ తేదీ తర్వాత విడుదల కానున్నాయి.

ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తైంది. ఆన్‌లైన్‌లో మార్కుల ఎంట్రీకి సంబంధించిన ప్రాసెస్‌ జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డు సన్నాహాలు చేస్తోంది. మార్చి 10 నుంచే ప్రారంభమైన సమాధాన పత్రాల మూల్యాంకనం ఏప్రిల్‌ 10తో పూర్తైంది. మొత్తం 4 విడతల్లో మూల్యాంకనం చేశారు.

ఆన్‌లైన్‌లో మార్కుల నమోదుతోపాటు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 20 తర్వాత ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో ఈసీ నుంచి అనుమతి తీసుకోన్నట్లు విద్యాశాఖ పేర్కొంది. కాగా అటు ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ 12వ తేదీన ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. త్వరలో పదో తరగతి ఫలితాల విడుదాలకు సన్నాహాలు చేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!