ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలైకి మద్దతుగా లోకేశ్‌ ప్రచారం.

Share This Post 🔥

తమిళనాడు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్‌సభ అభ్యర్థి అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రచారం చేయనున్నారు.

గురు, శుక్రవారాల్లో ఆయన కోయంబత్తూరులో పర్యటించనున్నారు. తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో నిర్వహించే సభలు, సమావేశాలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు. గురువారం రాత్రి 7 గంటలకు పీలమేడులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. సింగనల్లూరులోని ఇందిరా గార్డెన్స్‌లో శుక్రవారం ఉదయం తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేశ్‌ సమావేశమవుతారు.

శకారంభం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన లోకేశ్‌

యువగళం పాదయాత్రపై సీనియర్‌ పాత్రికేయుడు పెమ్మరాజు కృష్ణకిషోర్‌ రచించిన ‘శకారంభం’ పుస్తకాన్ని లోకేశ్‌ ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం ఆవిష్కరించారు. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి అగనంపూడిలో ముగింపు వరకు చోటుచేసుకున్న కీలక పరిణామాల్ని రచయిత పుస్తకంలో ప్రస్తావించారు.

.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!