Uncategorizedఆంధ్రప్రదేశ్ఆరోగ్యంచిన్నారిజాతీయంతెలంగాణమహిళ

జీయర్ ట్రస్ట్ ఆలయం పై 10 లక్షల డాలర్లు దావా…

Share This Post 🔥

అమెరికా : టెక్సస్‌ రాష్ట్రంలోని అష్టలక్ష్మీ ఆలయంలో గతేడాది ఆగస్టులో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో 11 ఏళ్ల బాలుడి రెండు భుజాలపై ఎర్రగా కాల్చిన శంఖు, చక్రాల గుర్తులు గల ఇనుప కడ్డీలతో ముద్ర వేయడం వివాదస్పదమైంది.  బాలుడి తండ్రి విజయ్‌ ఆలయ నిర్వహణ సంస్థ జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ (అమెరికా) నుంచి 10 లక్షల డాలర్ల నష్టపరిహారం కోరుతూ ఇటీవల కోర్టు లో దావా వేశారు. తమ కుమారుడిని తన మాజీ భార్య గుడికి తీసుకెళ్లి ముద్ర వేయించడం వల్ల ఆ పిల్లాడు ఎంతో బాధకు గురయ్యాడోనని కోర్టుకు తెలిపారు. దీనికి తండ్రి అనుమతి లేదని, టెక్సస్‌లో తల్లిదండ్రుల అనుమతి ఉన్నా లేకున్నా బాలలకు పచ్చబొట్లు పొడవడం, కర్రుపెట్టి ముద్ర వేయడం చట్టవిరుద్ధమని విజయ్‌ న్యాయవాది బ్రాంట్‌ స్టోగ్నర్‌ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆలయ నిర్వాహకులు స్పందించలేదు.

……
……. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!