ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

చేబ్రోలులో పవన్ కళ్యాణ్ నివాసం

Share This Post 🔥

ఆంధ్రప్రదేశ్ ::  కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

నేపథ్యంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆయన నివసించే భవనానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. చేబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉండడంతో దీన్ని ఎంపిక చేశారు.

7 నుంచి పవన్‌ ఎన్నికల ప్రచారం

వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఈనెల 7న అనకాపల్లి, 8న ఎలమంచిలి శాసనసభ నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటించనున్నట్లు పార్టీ కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఉగాది పర్వదినం సందర్భంగా 9న పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించనున్న వేడుకల్లో పవన్‌ పాల్గొననున్నారు. జ్వరం కారణంగా రెండ్రోజుల క్రితం ప్రచారానికి తాత్కాలిక విరామం ప్రకటించిన ఆయన.. ఆదివారం నుంచి యథావిధిగా తదుపరి పర్యటనకు సిద్ధమవుతున్నారు. నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటన షెడ్యూల్‌ను త్వరలోనే ఖరారు చేయనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!