Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మే 27న పోలింగ్.

Share This Post 🔥

వచ్చే నెల 2 నుంచి 9 దాకా నామినేషన్ల స్వీకరణ
జూన్ 5న ఓట్ల లెక్కింపు.. షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ
మొత్తం ఓటర్లు 4,61,806 మంది

వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై పోల్ కు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది.

మే 2న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. మే 9 వరకు నామినేషన్ల స్వీకరణ, ఉప సంహరణకు మే 13 వరకు గడువు ఉంటుంది. మే 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. జూన్ 5న ఓట్లు లెక్కిస్తారు. 2021లో ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. వరంగల్ — ఖమ్మం — నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లోని గ్రాడ్యుయేట్స్ ఓటర్లుగా నమోదు చేసుకునే గడువు పూర్తవడంతో తాజాగా ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో పురుషులు 2,87,007, మహిళలు 1,74,794, ఇతరులు ఐదుగురు ఉన్నారు.

సీఎంను కలిసిన తీన్మార్ మల్లన్న

వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్నను ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రకటించింది. 2021లో ఇదే స్థానం నుంచి ఆయన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి రెండో స్థానంలో నిలిచారు. తనను అభ్యర్థిగా ప్రకటించినందుకు గాను గురువారం సీఎం రేవంత్రెడ్డిని తీన్మార్ మల్లన్న కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!