ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు… భారత్ తీవ్ర అభ్యంతరం.

Share This Post 🔥

ఢీల్లీ :: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఢీల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు వ్యవహారంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది.

మొన్నామధ్య జర్మనీ దీనిపై ప్రకటన విడుదల చేయగా.. తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా స్పందించింది. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన భారత్‌ చర్యలు చేపట్టింది. దిల్లీలోని యూఎస్‌ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.

ఈ క్రమంలోనే అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ గ్లోరియా బెర్బేనా బుధవారం సౌత్‌ బ్లాక్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. దాదాపు 30 నిమిషాల పాటు అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఆమె వద్ద భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ”దౌత్య సంబంధాల్లో ఆయా దేశాలు ఇతరుల సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని మేం భావిస్తున్నాం. తోటి ప్రజాస్వామ్య దేశాల విషయంలో ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. లేదంటే సంబంధాలు దెబ్బతింటాయి. భారత న్యాయ ప్రక్రియలు స్వతంత్ర న్యాయవ్యవస్థపై ఆధారపడి ఉంటాయి. ఇందులో కచ్చితమైన, సమయానుకూల ఫలితాలు వస్తాయి. దీనిపై అంచనాలు వేయడం సరికాదు” అని అగ్రరాజ్యానికి విదేశాంగశాఖ స్పష్టంగా చెప్పింది.

కేజ్రీవాల్‌ అరెస్టుపై ఈ-మెయిల్‌లో అడిగిన ఓ ప్రశ్నకు అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మంగళవారం బదులిచ్చారు. భారత్‌లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

అంతకుముందు జర్మనీ విదేశాంగశాఖ కూడా ఇదే విధమైన అధికారిక ప్రకటన విడుదల చేసింది. ”భారత్‌ ప్రజాస్వామ్య దేశం. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హులు. అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చు” అని ఆ ప్రకటనలో పేర్కొంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్‌.. ఆ దేశ రాయబారికి సమన్లు ఇచ్చింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!