ఆంధ్రప్రదేశ్తెలంగాణరాజకీయం

కెసిఆర్ కు తన పార్టీ అంతరించిపోతుందనే భయం పట్టుకుంది : రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క .

Share This Post 🔥

కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని ఎన్డీవీ క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

గతంలో కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలను గెలిచి కూడా మా పార్టీలోని 12 ఎమ్మెల్యేలను లాగేసుకున్నాడనే విషయాన్ని గుర్తు చేశారు. మేము ఎప్పుడూ కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, నలిపేస్తాం, మేమే మళ్లీ అధికారంలోకి వస్తామని తప్పుడు మాటలు మాట్లాడలేదని చెప్పారు. మేము ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని నిలబెట్టడమే మా యొక్క ప్రథమ లక్ష్యమన్నారు. మేము ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కానీ, ఏ శాసన సభ్యుడిని గానీ, బలవంతంగా వచ్చి.. బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో చేర్చుకోవడం లేదని, వాళ్లు బీఆర్ఎస్ పార్టీలో ఇమడలేక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారన్నారు.

పలు సర్వేల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒకటి రెండు సీట్లు మాత్రమే వస్తాయని తేలిందని, బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ చెప్పే మాయమాటలు ప్రజలకు తెలుసు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే సగానికి పైగా హామీలను అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ప్రతి హామీని వంద శాతం మేం అమలు చేసి తీరుతాం.. బీఆర్ఎస్ ప్రభుత్వంలా మేము మోసాలు చేయం అని ఆయన పేర్కొన్నారు. ఇక, గత 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఎన్నీ హామీలను అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత బంధును కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలకే ఇచ్చారని పేర్కొన్నారు. 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి దళితులను బీఆర్ఎస్ పార్టీ దారుణంగా మోసం చేసిందన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నాడంటూ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ- బీఆర్ఎస్ కుట్రపూరితంగా ఈ ప్రచారం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

కరెంట్ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు లేకుండా నిరంతర విద్యుత్ ను ప్రజలకు అందిస్తున్నాము.. కరెంట్ కోతలు అనేవి అవాస్తవం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్వాలిటీ విద్యుత్ ను అందిస్తున్నాం.. విద్యుత్, ఆర్థికశాఖలను బీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్థం చేసింది.. ఈ రెండు శాఖలు మాకు ఒక సవాల్ అని తెలిపారు. ఇక, హైదరాబాద్ కి వాటర్ సమస్య రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంచి నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!