Uncategorizedఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుచిన్నారితెలంగాణమహిళ

కరివేపాకు తో మెరుగైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి…

Share This Post 🔥

ప్రతి రోజూ కరివేపాకును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ  సమస్యలు పరిష్కారంతో పాటు శరీరానికి రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో జీర్ణక్రియ, చర్మం సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఖాళీ కడుపుతో కరివేపాకు తీసుకుంటే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.  పచ్చి కరివేపాను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో  మనం  తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.



ఖాళీ కడుపుతో కరివేపాకు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ::  

కరివేపాకులో విటమిన్ సి, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్, నికోటినిక్ యాసిడ్స్‌ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఖాళీ కడుపుతో కరివేపాకును ప్రతి రోజు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కూరగాయలు, సలాడ్లు, ఓట్స్ లో కరివేపాకును వినియోగిస్తే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.



జీర్ణక్రియ సమస్యలకు చెక్‌ ::

కరివేపాకులో చాలా రకాల ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు దూరమవుతాయి.  అంతేకాకుండా గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో కరివేపాకును తీసుకోవాలని ఆయుర్వేద వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.


శరీర బరువును నియంత్రిస్తుంది ::

కరివేపాకులో శరీర బరువును నియంత్రించే ఫైబర్‌ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి కరివేపాకుతో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల సులభంగా ఊబకాయం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.

అలసట సమస్యలకు చెక్‌ ::

ప్రస్తుతం చాలా మందిలో ఉదయం నిద్రలేచిన వెంటనే అలసట, వికారం, వాంతులు వంటి సమస్యలకు గురవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు కరివేపాకు జ్యూస్‌ తాగాలని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ రసాన్ని తాగడం వల్ల అలసట సమస్యలే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.






గమనిక ::  ఆయుర్వేద వైద్య  నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందిస్తున్నాము.  ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

               ధన్యవాదాలు.
………………………………………

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!