ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.

Share This Post 🔥

దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఒపీనియన్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. అయితే ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచురించడం, ప్రచారం చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఏప్రిల్ 19న ఉదయం 7 గంటల నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో సహా అన్ని రకాల మీడియాకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.


ఆయా రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు 48 గంటల వ్యవధిలో ఒపీనియన్ పోల్స్ ఫలితాలు లేదా మరే ఇతర సర్వే ఫలితాలతో సహా ఎన్నికలకు సంబంధించిన కంటెంట్ ను మీడియాలో ప్రసారం చేయడం నిషేధించామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

కాగా.. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10.5 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 44 రోజుల పాటు జరిగిన పోలింగ్ ప్రక్రియలో 49.7 కోట్ల మంది పురుషులు, 47.1 కోట్ల మంది మహిళలు మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!