ఆంధ్రప్రదేశ్జాతీయంమహిళరాజకీయం

ఏపీ వాలంటీర్ల పై ఆంక్షలు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం.

Share This Post 🔥

ఏపీలో వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లను వినియోగించొద్దని ఆంక్షలు విధించింది.

ఎన్నికల కోడ్ ముగిసే వరకు లబ్ధిదారులకు డబ్బు పంపిణీ చేయించవద్దని ఆదేశించింది. అంతేకాదు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసుకోవాలని సీఈసీ అదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. అవసరమైతే నగదు బదిలీ ద్వారా పథకాలు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.

కాగా ఏప్రిల్ 1న పింఛన్ దారులకు నగదు పంపిణీ చేయాల్సి ఉండగా ఎన్నికల సంఘం ఈ ఆంక్షలు విధించింది. దీంతో పింఛన్‌దారులకు నగదు పంపిణీపై ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది. డైరెక్ట్‌గా వాళ్ల బ్యాంక్ అకౌంట్లలోనే డబ్బులు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సీఈసీ ఆంక్షలతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా తమ డబ్బులు ఆగిపోతాయోనని ఆవేదన చెందుతున్నారు. ప్రతి నెలా వాలంటీర్లు ఇంటి దగ్గరకు వచ్చి డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు. ఏప్రిల్, మే, జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, ఈ మూడు నెలల పింఛన్ డబ్బులు ఎలా అందిస్తారో అధికారులు స్పష్టత ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!