Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

ఏపీలో ముగిసిన నామినేషన్ల పర్వం.

Share This Post 🔥

ఏపీలో వచ్చే నెల 13న జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. అసెంబ్లీ, లోక్ సభ సీట్లకు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈనెల 29 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం బరిలో ఉన్న అభ్యర్దుల సంఖ్య తేలుతుంది. మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తారు.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు గాను 5 వేలకు పైగా నామినేషన్లు వచ్చాయి. అలాగే పార్లమెంట్ ఎన్నికలకు వెయ్యి వరకూ నామినేషన్లు వచ్చాయి. అభ్యర్ధులు సమర్పించిన నామినేషన్ల అఫిడవిట్లను ఎన్నికల అధికారులు సీఈవో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కచ్చితంగా ఎంతమంది నామినేషన్లు దాఖలు చేశారన్నది తేలనుంది.అలాగే ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అధినేతలైన వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి పోటీ చేస్తున్న సీట్లలో ఓ మోస్తరుగా నామినేషన్లు దాఖలయ్యాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!