ఆంధ్రప్రదేశ్క్రీడలుజాతీయంతెలంగాణ

ఎవరీ సమీర్ రిజ్వి …? రషీద్ ఖాన్ కి చుక్కలు చూపించాడు.

Share This Post 🔥

చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాడు సమీర్ రిజ్వీ తన ఐపీఎల్ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. ఐపీఎల్‌లో తన ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్‌గా మలిచాడు సమీర్‌ రిజ్వీ.

ఐపీఎల్‌-2024లో భాగంగా చెపాక్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రిజ్వీ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌ వేసిన రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో రెండో బంతికి శివమ్‌ దూబే ఔటయ్యాడు. అయితే రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు వస్తాడని అంతా భావించారు.

కానీ అనూహ్యంగా యువ ఆటగాడు రిజ్వీకి సీఎస్‌కే మెనెజ్‌మెంట్‌ ప్రమోషన్‌ ఇచ్చింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రిజ్వీ.. తన ఎదుర్కొన్న తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. స్వ్కెర్‌ లెగ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. దీంతో రషీద్‌ ఖాన్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. నాలుగో బంతికి రెండు పరుగులు తీసిన..మళ్లీ ఆఖరి బంతికి లాంగాఫ్‌ దిశగా భారీ సిక్స్‌ కొట్టాడు.

ఆ తర్వాతి ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రిజ్వీ ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 6 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రిజ్వీ.. 2 సిక్స్‌ల సాయంతో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడు ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఎవరీ సమీర్‌ రిజ్వీ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

ఎవరీ సమీర్‌ రిజ్వీ…?


20 ఏళ్ల సమీర్‌ రిజ్వీ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మీరట్‌లో జన్మించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఉత్తర్‌ ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2020లో మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీట్రోఫీ మ్యాచ్‌తో రిజ్వీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అయితే రిజ్వీకు టీ20 క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. కేవలం 9 ఇన్నింగ్స్‌లలో రిజ్వీ 49.16 సగటుతో 295 పరుగులు చేశాడు. గతేడాది జరిగిన యూపీ టీ20 లీగ్‌లో రిజ్వీ దుమ్మురేపాడు.

ఈ లీగ్‌లో కన్పూర్‌ సూపర్‌ స్టార్స్‌ తరపున ప్రాతినిథ్యం వహించిన రిజ్వీ.. 455 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కూడా రిజ్వీ అదరగొట్టాడు. ఈ టోర్నీలో ఓవరాల్‌గా 18 సిక్స్‌లు రిజ్వీ కొట్టాడు. ఈ క్రమంలో తన పేరును ఐపీఎల్‌ వేలంలో రిజిస్టర్‌ చేయించుకున్నాడు. అయితే ఐపీఎల్‌-2024 మినీవేలంతో అతడి దశ తిరిగిపోయింది.

రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చిన సమీర్‌ రిజ్వీని రూ.8.40 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్‌ కింగ్స్ సొంతం చేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే తుది జట్టులో రిజ్వీ ఉన్నప్పటికీ బ్యాటింగ్‌ చేసే అవకాశం మాత్రం రాలేదు. గుజరాత్‌తో మ్యాచ్‌లో తనకు వచ్చిన అవకాశాన్ని రిజ్వీ సద్వినియోగపరుచుకున్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!