ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

ఎన్నికలవేళ రాష్ట్రంలో సంచలనం పరిణామం.. వివేకానంద రెడ్డి రెండో భార్యతో ఉన్న వీడియోలు వైరల్…

Share This Post 🔥

ఆంధ్రప్రదేశ్. ::  ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురవడం అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. 2019లో హత్య జరిగిన ఇప్పటి వరకు హత్య మిస్టరీ ఏమిటో ఏమాత్రం బయటపడటం లేదు. మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలు, రెండు సార్లు సీబీఐ బృందాలు విచారించినా వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో వివేక హత్య రాష్ట్రంలో పోలిటికల్‌గా అగ్గి రాజేస్తూనే ఉంది. రాజకీయంగా అటు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. మరోవైపు కేసు విచారణలో జరుగుతున్న ఆలస్యం పట్ల వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీ నేతలు ‘who killed babai’ అనే హ్యష్ ట్యాగ్‌తో హాల్ చల్ చేశారు.

అనంతరం వైఎస్ఆర్‌సీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైఎస్ షర్మిల తన బాబాయ్‌ హత్యకు గురవడం పట్ల సీఎం జగన్‌పై రాజకీయంగా పదునైన విమర్శలు చేస్తున్నారు. తన చిన్నాన్నను ఎవరు చంపారో వాళ్లకు తన అన్నే ఆశ్రయం ఇస్తున్నాడంటూ ఇటీవలే ఓ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వివేకనంద రెడ్డి రెండో భార్య, ఆమె కొడుకుతో ఉన్న వీడియో వైరల్ అవుతున్నాయి. ఈ పరిణామంతో అధికార వైసీపీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఓ వైపు వైఎస్ సునీత, వైఎస్ షర్మిల ఆరోపణలు జగన్‌ను చెవిలో జోరిగలా ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు కోర్టులో వివేక హత్య కేసు విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందోనని ఓ టెన్షన్ పుట్టిస్తుంది. అది చాలదని ఇప్పుడు ఏకంగా వివేకా వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతుండటంతో ఎన్నికల్లో పార్టీపై ఏ మేర ప్రభావం పడుతుందోనని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!