ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ …

Share This Post 🔥

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో (Delhi liquor case) బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత  బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది.

బెయిల్‌పై మే 6న తీర్పు ఇవ్వనుంది. కవిత బెయిల్ పిటిషన్‌పై బుధవారం కోర్టులో విచారణకు రాగా… ఈడీ వాదనలు వినిపించింది. సెక్షన్ 19 కింద కవితను చట్టబద్దంగా అరెస్టు చేశామని… అక్రమంగా అరెస్టు చేశారనే దానిలో పసలేదని ఈడీ పేర్కొంది. అలాగే కేసుకు సంబంధించి మరికొన్ని వివరాలను ఈడీ తరపున న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. దాదాపు రెండు గంటల పాటు ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అనంతరం తీర్పును స్పెషల్ కోర్టు రిజర్వ్ చేసింది. ఎల్లుండి (ఏప్రిల్ 26) లోగా కవిత తరపు న్యాయవాది రిజైండర్ దాఖలు చేయనున్నారు.

ఈడీ వాదనలు ఇవే….

కవితను సెక్షన్ 19 కింద చట్టబద్దంగా అరెస్టు చేశామని.. అక్రమంగా అరెస్టు చేశారనే దానిలో పసలేదని ఈడీ వెల్లడించింది. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందన్నారు. రూ. 581 కోట్లు హోల్ సేల్ వ్యాపారులు సంపాదించారని… అయిదు నుంచి 12 శాతానికి కమీషన్ పెంచారన్నారు. దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరిగిందని తెలిపారు. ఈ పాలసీలో ఇండో స్పిరిట్‌కు మేజర్ షేర్ దక్కిందని.,. దీని ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు. పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారని చెప్పారు. విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కథ నడిపారన్ నారు. విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని.. అసాధారణ లాభాలు గడించారని కోర్టుకు విన్నవించారు. బలవంతంగా మహదేవ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి పక్కకు తప్పించారన్నారు. ఈ కేసులో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కలేదని కోర్టుకు తెలిపారు.అవి ఈ కేసులో అనవసరం…

ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల లంచం అందిందన్నారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి కీలక స్టేట్మెంట్ ఇచ్చారని తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్‌ను మాగుంట శ్రీనివాసులురెడ్డి మద్యం వ్యాపారం కోసం ఢిల్లీ సెక్రటేరియట్ లో కలిశారని.. కవితను కలవాలని కేజ్రీవాల్ చెప్పారని మాగుంట చెప్పారన్నారు. కవితను కలిసినప్పుడు 100 కోట్లు ఆప్‌కి ఇస్తే ఢిల్లీ మద్యం వ్యాపారం ఇస్తారని ఆమె చెప్పిందన్నారు. అందులో రూ.25 కోట్లు కవిత మనిషి బుచ్చిబాబుకు మాగుంట చెల్లించారన్నారు. ఎల్ 1 లైసెన్స్‌లో మేజర్ షేర్ దక్కించుకేందుకు కవిత ప్రయత్నించారన్నారు. అయితే, సమీర్ మహేంద్రకు 33, మాగుంట 33, కవిత 33 శాతం వాటాలను పొందారని కోర్టుకు తెలియజేశారు.

బుచ్చిబాబు, మాగుంట రాఘవ వాట్సాప్ మెసేజ్‌లో ఈ సాక్షాలు దొరికాయన్నారు. మాగుంట రాఘవ అప్రూవర్‌గా మారి అన్ని విషయాలను ధృవీకరించారన్నారు. ఒకసారి రూ.15 కోట్లు, మరోసారి రూ.10 కోట్లు బుచ్చిబాబుకు, అభిషేక్ బోయినపల్లికి మాగుంట సిబ్బంది ఇచ్చారన్నారు. అనుకూలంగా లిక్కర్ పాలసీ తయారీ కోసం ఈ లంచాలు ఇచ్చారని తెలిపారు. కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్‌గా మారారన్నారు. అప్రూవర్‌ను ప్రలోభ పెట్టారని అనుమానిస్తే కోర్టు నిర్ణయాన్ని తప్పు పట్టడమే అని చెప్పుకొచ్చారు. అప్రూవర్‌లపై చేస్తున్న ఆరోపణలు ప్రచారం కోసం చేస్తున్న రాజకీయ వాదనలే తప్పు వాటిలో పస లేదన్నారు. ఎవరు ఎవరికి ఎలక్టొరల్ బాండ్స్ ఇచ్చారనేది ఈ కేసులో అనవసరమన్నారు. చట్టం ప్రకారమే ఈ కేసు ముందుకి వెళ్ళాలని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు.

కవిత ఒత్తడితోనే అరుణ్ పిళ్లై వాంగ్మూలం ఉపసంహరన…

11.11.2022 న అరుణ్ పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారని.. కవిత ప్రాక్సీనంటూ అరుణ్ రామచంద్రన్ పిళ్ళై వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. కవితకు నోటీసులు ఇచ్చాకే అరుణ్ పిళ్ళై తాను ఇచ్చిన స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకున్నారన్నారు. కవిత ఒత్తిడితోనే అరుణ్ రామచంద్రన్ పిళ్ళై వెనుకడుగు వేశారని చెప్పారు. అరుణ్ పిళ్ళై తన స్టేట్మెంట్ ఇచ్చిన ఆరునెలల తర్వాత వెనక్కి తీసుకున్నారన్నారు. ఈడీ బెదిరిస్తే ఆరునెలల తర్వాత స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటారా అని ప్రశ్నించారు. కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మధ్య అవగాహన ఉందని బుచ్చిబాబు స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. విజయ్ నాయర్‌తో కలిసి లిక్కర్ పాలసీ తయారు చేశారన్నారు. డ్రాఫ్ట్ లిక్కర్ పాలసీ వీళ్ళ దగ్గరకు వచ్చిందని.. బుచ్చిబాబుకి విజయ్ నాయర్ పంపించారన్నారు. కవిత చెప్పిన అంశాలే లిక్కర్  పాలసీలో ఉంచారన్నారు. అరుణ్ పిళ్ళై ద్వారా లిక్కర్ వ్యాపారంలో కవిత భాగం అయ్యారని చెప్పారు.

శరత్ రెడ్డి అమాయకుడు కాదు..

బుచ్చిబాబును తాము అరెస్ట్ చేయలేదని.. ఆయనను సీబీఐ అరెస్ట్ చేసిందని చెప్పారు. శరత్ రెడ్డి అమాయకుడు కాదన్నారు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో శరత్ చంద్రరెడ్డి ప్రధాన లబ్ది దారుడని కోర్టుకు చెప్పారు. 5 రిటెల్ జోన్స్ పొందినారన్నారు. కవిత బంధువు శ్రీనివాస్ రావు 1 కోటి రూపాయలు అరుణ్ పిళ్ళై కి ఇచ్చాను అని స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. కవిత ఆదేశాల మేరకు అరుణ్ పిళ్ళైకి కోటి రూపాయలు ఇచ్చారన్నారు. దినేష్ అరోరా స్టేట్మెంట్ ఇచ్చారని.. ఒబెరాయ్ హోటల్‌లో లిక్కర్ పాలసి రూపొందించారని తెలిపారు. బుచ్చిబాబు కూడా సమావేశంలో పాల్గొన్నారన్నారు.

.

కవిత బంధవును విచారణకు పిలిస్తే…

కవిత బంధువు మేక శరణ్‌ను ఇండో స్పిరిట్ ఉద్యోగిగా పెట్టారన్నారు. ఎక్కడ కూడా ఉద్యోగానికి హాజరు కాలేదని.. కానీ జీతం చెల్లించారన్నారు. మేక శరణ్‌ను హైదరాబాద్‌లో విచారించినట్లు తెలిపారు. మొదట విచారణకు పిలిస్తే ఎనిమిది రోజుల పాటు మేక శరణ్ మిస్సయ్యాడన్నారు. ఈ కేసుకు సంబంధించి అనేక మంది వాంగ్మూలాలు ఇచ్చారన్నారు. హవాలా ఆపరేటర్స్, అంగడియాలు స్టేట్మెంట్స్ ఇచ్చారన్నారు. కవిత ఇచ్చిన 9 ఫోన్లలో డేటా డిలీట్ చేశారని తెలిపారు. ఎందుకు డిలీట్ చేశారంటే కవిత సమాధానం చెప్పలేదన్నారు. కవిత ఫోన్లను పని మనుషులకు ఇచ్చారని పొంతన లేని సమాధానాలు చెపుతున్నారన్నారు. పని మనుషులు డేటా ఎందుకు డిలీట్ చేస్తారని ప్రశ్నించారు. ఫోన్లు ఇవ్వాలని కోరిన వెంటనే డేటా ఫార్మాట్ చేశారని.. సాక్ష్యాలను ధ్వంసం చేశారని, సాక్షులను బెదిరించారని కోర్టుకు ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అనంతరం బెయిల్‌పై తీర్పును ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్ట్ రిజర్వ్ చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!