ఆంధ్రప్రదేశ్చిన్నారిజాతీయంతెలంగాణమహిళసినిమా

ఇదిగో… అల్లు అర్జున్ మైనపు బొమ్మ.

Share This Post 🔥


పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఎల్లలుదాటింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బన్నీ..

ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంటర్నేషనల్ లెవల్లో మరో అరుదైన ఘనత సాధించారు. అల్లు అర్జున్ మైనపు బొమ్మను దుబాయ్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో (Madame Tussauds Dubai) ఆవిష్కరించారు. గురువారం రాత్రి 8 గంటలకు జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తెగ సందడి చేసింది.

ఈ కార్యక్రమానికి తన ఫ్యామిలీతో కలిసి పాల్గొన్న అల్లు అర్జున్.. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోస్, ఫొటోస్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ప్రతిమతో దిగిన ఫొటో పోస్టు చేస్తూ ఇలాంటి ప్రముఖ మ్యూజియంలో విగ్రహం ఏర్పాటు చేయడం ప్రతి నటుడి జీవితంలో ఓ మైల్‌ స్టోన్ అని అన్నారు. ఈ సందర్భంగా మేడమ్ టుస్సాడ్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు బన్నీ.

కాగా.. అల్లు అర్జున్ మైనపు బొమ్మకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన మైనపు బొమ్మతో అల్లు అర్జున్ దిగిన ఫొటోస్ చూసి.. ఇందులో ఏది నిజం, ఏది అబద్దం అని తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు నెటిజన్లు. బన్నీ డ్రెస్సింగ్, గెడ్డం అన్నీ కూడా అచ్చుగుద్దినట్లు ఒకేలా కనిపిస్తుండటం విశేషం. ఈ విగ్రహం చూసి బన్నీకి పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెబుతున్నారు ఆయన ఫ్యాన్స్.

సింగపూర్‌, లండన్‌, దుబాయ్‌ పలుచోట్ల మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్స్ ఉన్నాయి. అయితే టాలీవుడ్ నుంచి ప్రభాస్‌, మహేష్‌ బాబు మైనపు విగ్రహాలు లండన్ మేడం టుస్సాడ్స్ లో ఏర్పాటు చేయగా.. అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయ్‌ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు సౌత్‌ ఇండియాకు చెందిన నటుల విగ్రహాలు ఏవీ లేవు. సౌత్ ఇండియన్ హీరోల్లో నుంచి మొట్ట మొదటి విగ్రహం బన్నీదే కావడం విశేషం.

తన మైనపు బొమ్మను ఆవిష్కరిస్తున్న అల్లు అర్జున్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!