ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

అయోధ్య రాముడికి నేడు సూర్యతిలకం.

Share This Post 🔥

అయోధ్య :: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ ‘సూర్య’తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు.

జనవరి 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన అయోధ్య రామాలయానికి ఇది తొలి శ్రీరామనవమి. సూర్యకిరణాల ప్రసరణ ఏర్పాట్లను మంగళవారం శాస్త్రవేత్తలు పరిశీలించారు. ”ఏటా శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం నుదుటన కిరణాలతో ‘తిలకం’ ఏర్పాటుచేయడమే సూర్య తిలక్‌ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. చైత్రమాసంలో వచ్చే ఈ పండుగ వేళ మధ్యాహ్నం ఆ దృశ్యాన్ని చూడవచ్చు” అని ఈ ప్రాజెక్టుకు సహకరించిన సీఎస్‌ఐఆర్‌ – సీబీఆర్‌ఐ రూర్కీ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.కె.పాణిగ్రాహి తెలిపారు. మూడు నుంచి మూడున్నర నిమిషాలపాటు ఉండే ఈ సూర్యకిరణాల తిలకం 58 మి.మీ.ల పరిమాణంలో ఉంటుందన్నారు. ఇందులో రెండు నిమిషాలు పూర్తిస్థాయిలో తిలకంలా కనిపిస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!