ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

అమెరికాలో నౌక ఢీకొట్టడంతో కూలిన వంతెన… నౌకలో భారతీయ సిబ్బంది..

Share This Post 🔥

అమెరికాలో నౌక ఢీకొనడంతో భారీ వంతెన కూలిపోయింది. ఆ వంతెనపై ప్రయాణిస్తున్న వాహనాలు నదిలో పడిపోయాయి.

మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ నగరంలో పటాప్స్క నదిపై ఉన్న ‘ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి’ పిల్లర్లను డాలీ అనే ఓడ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.

నౌక సిబ్బందిలో 22 మంది భారతీయులు ఉన్నారు.

ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఎక్కువే ఉండొచ్చని బాల్టిమోర్ సిటీ అగ్నిమాపక శాఖ ప్రతినిధి కెవిన్ కార్ట్‌ రైట్ అంచనా వేశారు.

సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, నదిలో పడిన వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యా యని కెవిన్ చెప్పారు.

ఇప్పటివరకు మృతుల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు.

ప్రమాదం ఎలా జరిగింది…?

ఈ నౌక బాల్టిమోర్ నుంచి శ్రీలంక వైపు వెళుతోంది. దానిలో కంటైనర్లు లోడ్ చేశారు. అర్ధరాత్రి దాటాక స్థానిక కాలమానం ప్రకారం 12.44 గంటలకు బాల్టిమోర్ పోర్ట్ నుంచి నౌక బయలుదేరింది.

ప్రయాణ సమయంలో వంతెన వెళ్లాల్సిన మార్గం నుంచి కాకుండా మరో వైపు మళ్లింది.

ఆ సమయంలో నౌకలో లైట్లు వెలుగుతూ ఆగుతూ కనిపించాయి. ఆ తర్వాత నౌక నుంచి పొగ వచ్చింది.

అలా వెళ్లి వంతెనను ఢీకొట్టింది. ఈ ఓడ అలా దారి ఎందుకు మళ్లిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాద సమయంలో వంతెనపై కొందరు నిర్మాణ కార్మికులు ఉన్నారని అధికారులు తెలిపారు.

ప్రమాదాన్ని అంచనా వేయలేకపోతున్న అధికారులు

ఈ వంతెన అనేక భాగాలు ఇప్పటికీ నీటిలో మునిగి ఉన్నాయి. సంబంధిత నౌక సంఘటన స్థలంలోనే ఉంది.

ఈ నౌకలో అనేక కంటైనర్లు లోడ్ చేసి ఉన్నాయి.

రెస్క్యూ బృందాలు ఒక్కొక్కటిగా ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నాయి.

కానీ వాతావరణం బాగా చలిగా ఉండడం వల్ల సహాయ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు.

నీటిలో తేలుతూ కనిపిస్తున్న జనం..

‘ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి’ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎక్కువ ఉండొచ్చని బాల్టిమోర్ అగ్నిమాపక శాఖ ప్రతినిధి అంచనా వేస్తున్నారు.

ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉష్ణోగ్రత -1 డిగ్రీ సెంటీ గ్రేడ్ వరకు ఉందని ఆ అధికారి చెప్పారు. మరోవైపు ఈ ఘటనకు అసలు కారణం ఇంకా తెలియరాలేదు.

ఘటనపై బాల్టిమోర్‌ లోని వివిధ విభాగాల సీనియర్ అధికారులు మీడియాతో మాట్లాడారు.

వంతెన వద్దకు సహాయక బృందం చేరిందని, కొందరు నీటిలో తేలుతూ కనిపిస్తున్నారని బాల్టిమోర్ సిటీ ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ వాలెస్ చెప్పారు.

నీటిలో పడిపోయిన ఇద్దరిని రక్షించి బయటకు తీసుకొచ్చామని, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

”ఓడ దారి తప్పి వంతెనను సమీపించడంతో హెచ్చరిక జారీ అయింది. అనంతరం వంతెన వైపు వెళ్లే వాహనాలు ఆగిపోయాయి. దీంతో చాలామంది ప్రాణాలు నిలిచాయి” అని మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ అన్నారు.

ఇది ఒక విషాదకర ప్రమాదమని బాల్టిమోర్ మేయర్ బ్రాండన్ స్కాట్ అన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ఓడ నుంచి ఆయిల్ లీకేజీ జరిగిందా లేదా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నట్లు బ్రాండన్ స్కాట్ తెలిపారు.

ఈ ఘటనలో ఉగ్రవాద ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు చెప్పారు.

డాలీ అనే ఈ నౌక ‘సినర్జీ మెరైన్ గ్రూప్’ కంపెనీకి చెందినది.
షిప్ కంపెనీ ఏమంటోంది?

డాలీ (ఐఎంఓ 9697428) అనే ఈ నౌక సింగపూర్‌కు చెందిన ‘సినర్జీ మెరైన్ గ్రూప్’ కంపెనీకి చెందినది.

నౌకలోని సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్లు ఒక ప్రకటనలో ప్రకటించింది.

ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ‘క్వాలిఫైడ్ ఇండివిజువల్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ సర్వీస్’ ఏర్పాటు చేశామని స్పష్టంచేసింది.

రిటైర్డ్ స్ట్రక్చరల్ ఐరన్ వర్కర్ ప్రిసిల్లా థామ్సన్‌ ఈ ప్రమాదం గురించి వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!