ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

అందుకే బిఆర్ఎస్ కష్టాల్లో పడింది.:  గుత్తా సుఖేందర్ రెడ్డి.

Share This Post 🔥

హైదరాబాద్‌ : తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నానన్నారు.

పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ఇప్పుడు కష్టాల్లో ఉందన్న ఆయన, పార్టీలో నిర్మాణ లోపం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని తెలిపారు. ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు చేయడం వల్లే పార్టీ కష్టాల్లో పడిందని అభిప్రాయపడ్డారు.

”ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని భారాస ఫిర్యాదు చేసింది. వాటిని పరిశీలిస్తున్నాం. న్యాయబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా నిర్ణయం తీసుకుంటా. నా కుమారుడు అమిత్‌రెడ్డికి భారాస ఎంపీ టికెట్‌ ఇవ్వలేదనేది అవాస్తవం. ఆయనను  ఎంపీగా పోటీలో దించాలని స్వయంగా కేసీఆర్‌ కోరారు. దానికి అమిత్‌ కూడా సిద్ధమయ్యారు. జిల్లాలోని నాయకుల నుంచి సహకారం అందలేదు. కొందరు నేతలు తామే పార్టీ మారుతున్నామని చెప్పారు. అందుకే అమిత్‌ పోటీ నుంచి వైదొలిగారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించా… ఆరు నెలలు ప్రయత్నించినా కలవడం సాధ్యం కాలేదు. ఇప్పటికైనా పార్టీ నిర్మాణంపై నాయకత్వంపై దృష్టి సారించాలి” అని గుత్తా అన్నారు.

గుత్తా వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత లేదు: జగదీశ్‌రెడ్డి

గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించారు. ఆయన చాలా సీనియర్‌ నాయకుడని, పార్టీ నిర్మాణంపై ఆయన సలహాలు తీసుకుంటామని అన్నారు. ఏ పార్టీ ఎలా ఉందనే విషయాలు గుత్తాకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. గుత్తా మాట్లాడిన అంశాలపై ఎంపీ ఎన్నికల తర్వాత చర్చిస్తామన్నారు. ఆయన వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!