ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంజాతీయంతెలంగాణమహిళరాజకీయం

అందమైన ఊరు. చుట్టూ నీళ్లు… మధ్యలో చిన్న గ్రామం..

Share This Post 🔥

నీటి మధ్యలో చిన్న దీవిలాంటి గ్రామము అది. చుట్టూ నీరు పచ్చని చెట్లతో కళకళలాడుతూ ప్రకృతి ప్రేమికులకు స్వాగతం పలుకుతుంది. ప్రకృతి ఒడిలో ఆవిర్భవించిన ఈ గ్రామం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుదనడంలో సందేహం లేదు.

పచ్చని చెట్లతో పొందిగ్గా ఉన్న ఆ దీవిలోకి ప్రకృతి ప్రేమికుల్ని స్వాగతం పలికుతూనే  పరవశించేలా చేస్తుంది. అందులో అడుగుపెట్టాక అందమైన పొదరిళ్లలాంటి ఇళ్లు పాతకాలం నాటి నిర్మాణాలు చూసిన వారిని మరింత ముగ్ధుల్ని చేస్తాయి.  సావో జసెంటో పేరుతో పిలిచే ఈ దీవి మరెక్కడో లేదు. గోవాలోని జువార నదిలో సముద్రతీరానికి దగ్గరలో నే ఉంటుంది.

ప్రకృతి ఒడిలో పుట్టినట్టుగా ఉండే ఈ దీవి, ఇదివరకు పోర్చుగీసు వాళ్లకు నివాసంగా ఉండేది. అందుకే ఆనాటి వాస్తు నైపుణ్యాల్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి దీవిలోని భవనాలన్నీ. ఇప్పటికీ ఈ ఊళ్లోని స్థలాల్ని బయటివాళ్లకు అమ్మరు, ఇళ్ళను అద్దెకివ్వరు. ఇంచుమించు 200 ఇళ్లు, వందల ఏళ్లనాటి చర్చితో ఉండే ఈ దీవి మంచి పర్యటక ప్రాంతం. గోవాలోని సముద్రతీరాలతో పాటూ నీళ్లలో పాతకాలం నాటి కట్టడాలతో ఉండే ఈ ఊరినీ చూడ్డానికి సందర్శకులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. దీవి చుట్టూ సరదాగా పడవల్లో షికారు కొడుతూ స్థానిక వంటల్ని ఆస్వాదిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!